దగ్గు జలుబు జ్వరము గొంతునొప్పులు
వస్తె వైద్యులకు చూపించి వైద్యమొందూ
శుభ్రతే భద్రతను నిత్య సత్యమునెరిగి
మనసుతనువుల స్వచ్ఛ పరచుమిపుడూ

గుమిగూడి జనులుండ అందుకలువకుమెపుడు
ఏకాంతవాసివై సంతసించూ
ఉందిగా చరవాణి చేతిలో నీకిపుడు
చక్రపాణి‌కి నీకు భేదమేమీ

అరచేతికున్నట్టి బొటనువేలువోలె(🖐️)
నలుగురికి దూరముగా మసలుమిపుడూ
మంచి తలుపులు పంచి మంచితనమును పెంచి
తలలోని నాలకై మెలుగుమిపుడూ

చైనా దేశాన పుట్టినది ఈ వ్యాధి
దీని వ్యాప్తికి లేదు వ్యవధి అవధి
ఓ మేని సారధీ వ్యాధి వారధివయ్యి
నిర్లక్ష్య అగ్నిలోకాకు సమిధీ

వైద్యనాధుడు శివుడు బ్రహ్మ భాగీరధుడు
వారిచ్చు శిక్షణే  రక్షణిపుడూ
శ్రీ మతపుపాలనతొ వారి పాలనపొంది
విశ్వ పాలన విద్య నేర్వుమిపుడూ

రచన: బీకే సాయి శ్యాం మనోహర్, సత్యనారాయణ పురం సేవా కేంద్ర,విజయవాడ

📱9705780646


BKSSM


#Soft

Telugu Poem by Bk swan and lotus translators : 111389683

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now